Ysrcp decided to boycott Ap Assembly session on Thursday.Ysrcp meeting held at Hyderabad on Thursday. Ysrclp made allegations on Tdp. <br />వచ్చే నెల 8వ, తేది నుండి ప్రారంభం కానున్న ఏపీ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన శాసనసభపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. వచ్చే నెల 6వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌కు గతంలోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు గతంలోనే స్పీకర్ ప్రకటించారు. <br />
